28.2 C
Hyderabad
Monday, June 5, 2023

అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి హెల్త్ బులెటిన్ విడుదల

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిలో పురోగతి కనిపించిందని వెల్లడించారు వైద్యులు. ప్రస్తుతం ఆమెకు వాంతులు తగ్గాయని తెలిపారు. ఐసీయూ నుంచి త్వరలో గదికి తరలించడానికి ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు.

మొదటగా అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి ఛాతీనొప్పి రావడంతో పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో చికిత్స అందించారు. డాక్టర్లు మెరుగైన వైద్యం అందించాలని కోరగా.. అక్కడి నుంచి అంబులెన్స్‌లో హైదరాబాద్‌ తరలించాలని భావించారు. ఈ క్రమంలో సీబీఐ విచారణకు హాజరుకావాల్సిన అవినాష్‌రెడ్డి.. వెంటనే పులివెందుల బయలుదేరి వెళ్లారు. మార్గ మద్యంలో తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద శ్రీలక్ష్మి ప్రయాణిస్తున్న అంబులెన్స్‌ అవినాష్‌కు ఎదురైంది. ఆ వెంటనే వాహనం దిగిన అవినాష్.. తన తల్లిని చూడడానికి వెళ్లారు. ఆమె ప్రయాణిస్తున్న అంబులెన్స్‌ లో ఎక్కి హైదరాబాద్‌ వైపు బయలుదేరారు. తన తల్లికి పరిస్థితి ఇబ్బందిగా మారడంతో కర్నూలు నగరంలోని విశ్వభారతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డికి కూడా ఛాతీలో సమస్య తలెత్తిందని అదే హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం అవినాష్ ఆరోగ్యం బాగుపడడంతో డిశ్చార్జ్ అయ్యారు.

 

Avinash Reddy's mother Srilakshmi health bulletin released

Latest Articles

పామును నోటితో కొరికి చంపిన బాలుడు

స్వతంత్ర, వెబ్ డెస్క్: పామును ఓ బాలుడు నోటితో కొరికి చంపేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఫరూఖాబాద్‌ జిల్లాలోని మద్నాపుర్‌ గ్రామంలో దినేశ్‌సింగ్‌ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతనికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్