Site icon Swatantra Tv

పారిశుధ్య కార్మికుల ఆగ్రహం

      చేతిలో చీపుర్లు, పారిశుధ్యం పనిముట్లతో కార్మికులు ఏపీలో మునిసిపల్ కార్యాలయాలను ముట్టడించారు. 12 రోజుల నుంచి తమ న్యాయమైన డిమాండ్ సాధనకు సమ్మె చేస్తుంటే సీఎం జగన్ పట్టించుకోకుండా చాలా హీనంగా ప్రవర్తించడంపై పారిశుధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పారిశుధ్య కార్మికులు శ్రీశైలం నియోజక వర్గం పాలనా కేంద్రం ఆత్మకూరు మునిసిపాలిటీ కార్యాలన్ని ముట్టడించారు. భారీగా తరలివచ్చిన కార్మికులు నినాదా లతో కార్యాలయంలోకి దూసుకెళ్లారు. తాము లక్షల మందికి ప్రాణదాతలం అంటూ నినాదాలు చేశారు. ఏపీలో చెత్త పేరుకుపోయి, రోగాలు ప్రబలితే సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు. మున్సిపల్ ఆఫీసు ముట్టడితో రోడ్లు స్తంభిం చిపోయాయి. ఐదేళ్లలో సీఎం జగన్‌ ఏపీని పారిశుధ్య కార్మికులను మోసగించారని నిప్పులు చెరిగారు.

Exit mobile version