Site icon Swatantra Tv

పంజాబ్, హర్యానాలో టెన్షన్ టెన్షన్

      ఈ నెల 13న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పంజాబ్‌, హర్యానాలో మరోసారి టెన్షన్‌ వాతావర ణం నెలకొంది. రైతులు ఛలో పార్లమెంట్‌ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలో నే హర్యానా ప్రభుత్వం మొబైల్‌ ఇంటర్నెట్‌, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లపై ఆంక్షలు విధించింది. మరోవైపు.. ఢిల్లీ బార్డర్స్‌లో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా వంటి 200కు పైగా రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ఛల్లో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. గత కొంత కాలంగా కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురా వాలని, రైతులకు పింఛను, పంటబీమా, 2020 ఆందోళనల్లో రైతులపై పెట్టిన కేసులు కొట్టివేయాలని డిమాండ్‌ చేస్తూ హరియాణా, పంజాబ్ రైతులు నిరసన చేస్తున్నారు.ఈ క్రమంలో ఈ నెల 13న పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో, హర్యానాలోని ఏడు జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఢిల్లీ వెళ్లాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

Exit mobile version