Site icon Swatantra Tv

డేవిడ్‌ వార్నర్‌ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్‌

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. భారత్‌పై వన్డే ప్రపంచకప్‌ గెలిచిన సందర్భంగా.. ఆటకు ముగింపు పలకడానికి సరైన సమయం ఇదేనంటూ ఆయన తెలిపారు. తన నిర్ణయం వల్ల కొత్త వారికి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. వార్నర్‌ ఇప్పటికే టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే, 2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరమైతే మాత్రం తాను పునరాగ మనం చేస్తానని చెప్పారు. మరోవైపు ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్‌ లీగ్‌లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. టెస్టు, వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకోవడం వల్ల ఫ్రాంఛైజీ లీగ్‌లలో ఆడేందుకు ఎక్కువ సమయం దొరుకుతుందని తెలిపారు. తన క్రికెట్‌ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ గ్రెగ్‌ చాపెల్‌కీలక పాత్ర పోషించినట్లు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.

2023 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చడంలో వార్నర్‌ కీలక పాత్ర పోషించాడు.రెండు శతకాలు, రెండు అర్ధశతకాలతో సహా మొత్తం 528 పరుగులు చేశాడు. జట్టు నుంచి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Exit mobile version