Site icon Swatantra Tv

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్

 

సినీ హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేసన్ కు చేరుకున్నారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ వెళ్లాల్సి ఉంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో నిన్న కోర్టు వెళ్లిన అల్లు అర్జున్ .. న్యాయమూర్తి ఎదుట సంతకాలు చేశారు. పూచీకత్తు పత్రాలు సమర్పించారు. ఆయన వెంట మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు.

నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు సందర్భంగా షరతులు విధించింది.  ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరవ్వాలని తెలిపింది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.

 

Exit mobile version