Site icon Swatantra Tv

చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్‌కు మంత్రి అంబటి కౌంటర్

     దమ్ముంటే అభివృద్ధి విషయంలో సీఎం జగన్ తనతో చర్చకు రావాలని చంద్రబాబు సవాల్ చేయడంపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ముందు తొడకొట్టినట్టుగా చంద్రబాబు సవాల్ ఉందని ఎక్స్ వేదికగా అంబటి స్పందించారు. ఈ మేరకు ఉదయం చంద్రబాబు చేసిన ట్వీట్‌కు అంబటి కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధి పాలన ఎవరిదో.. విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దామని చంద్రబాబు జగన్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ప్లేస్, టైమ్ జగనే చెప్పాలని సవాల్ విసిరారు. బాదుడు పాలనతో, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్‌ను కూల్చేసిన జగన్.. ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారని చంద్రబాబు ప్రశ్నించారు. బూటకపు ప్రసంగాలు కాదని.. అభివృద్ధిపై దమ్ముంటే తనతో చర్చకు రావాలని చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్‌ చేశారు. ఇదే విషయంపై అంబటి చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు.

 

Exit mobile version