Site icon Swatantra Tv

ఘనంగా ప్రారంభమైన వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్

       గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో వైభవంగా వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024 ప్రారంభమైంది. మహాత్మా మందిర్ కన్వెన్షన్, ఎగ్జిబిషన్ సెంటర్ లో సమ్మిట్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, చెక్ రిపబ్లిక్ ప్రధాని పీటర్ ఫియాలా, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ జసింటో న్యూసి, తైమూర్-లెస్టే జోస్ రామోస్-హోర్టా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ హాజరయ్యారు.

            వైబ్రంట్ గుజరాత్ శిఖరాగ్రసభలో 34 భాగస్వామ్య దేశాలు, 16 భాగస్వామ్య సంస్థలకు చెందిన ప్రధానులు, సీఈవోలు హాజరయ్యారు. పలు విదేశాలనుంచి వేలాది మంది ప్రవాస భారతీయులు, బిజినెస్ నిపుణులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు.

       వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో అదానీ గ్రూప్ ఛై ర్ పర్శన్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. వైబ్రెంట్ గుజరాత్ ప్రధాని మోదీ అసాధారణ దార్శనికతకు నిదర్శనం అన్నారు. గొప్ప ఆశయం, అవినీతికి తావులేని దోషరహితమైన పాలన వల్ల దేశం అభివృద్ధి పథంలో సాగుతున్నదన్నారు. భారతదేశ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మౌలికంగా పునర్ని ర్మించడానికి మన రాష్ట్రాలన్నీ పోటీపడి, సహకరిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు దేశ సర్వతో ముఖాభివృద్ధి దేశవ్యాప్త ఉద్యమంగా సాగుతోందని అదాని ఆన్నారు.

Exit mobile version