Site icon Swatantra Tv

కేజ్రీవాల్ ఇంటికి ఢిల్లీ పోలీసులు

  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చేందుకు క్రైంబ్రాంచ్ పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న వ్యాఖ్యలపై వివరణ కోరుతూ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలకు సంబంధించి ఆధారాలను అందించాలని ఈ నోటీసులో తెలిపారు. అయితే, కేజ్రీవాల్ అధికారిక నివాసం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది ఈ నోటీసులను తీసుకునేందుకు విముఖత చూపినట్లు తెలుస్తోంది. దీంతో నేరుగా ముఖ్యమంత్రిని కలిసి ఆయనకే అందజేయాలని పోలీసులు వేచి చూస్తున్నారు. ఇవే ఆరోపణలకు సంబంధించి ఢిల్లీ మంత్రి ఆతిశీకి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. నోటీసులతో ఆతిశీ నివాసానికి వెళ్లిన పోలీసులు.. మంత్రి ఇంట్లో లేకపోవడంతో వాపస్ వెళ్లిపోయినట్లు సమాచారం.

Exit mobile version