Site icon Swatantra Tv

కాంగ్రెస్ లో ఆచూకీ దొరకని విజయశాంతి

అసెంబ్లీ ఎన్నికల ముందు హాడావిడి చేసిన నటి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. నేతలంతా పదవుల కోసం క్యూ కడుతుంటే ఆమె మాత్రం ఎందుకో సైలెంట్ అయ్యారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో లో ఆక్టీవ్ గా ఉండేది. ఇప్పుడు ఎందుకో సోషల్ మీడియాలో పోస్ట్‌లు సైతం పెట్టడం లేదు. ఇంతకీ ఎవరా సినీ స్టార్ ఏంటా కథ చూద్దాం.

        తెలంగాణ రాజకీయాల్లో ఆ నేత అంటే తెలియనివారుండరు. అప్పడప్పుడు బయటకు వచ్చినా ,సోషల్ మీడి యాలలో ఫుల్ ఆక్టీవ్ గా ఉంటూ ప్రత్యర్ధుల పై పదునైన విమర్శలు చేస్తుంటారు. దీంతో ఎప్పుడు ఏం చేసినా ఆమె వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఏమైందో ఏమో ఈ మధ్య ఓక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇంతకీ ఏవరా నేత అనుకుంటున్నారా ఆమే లేడి సూపర్ స్టార్ విజయశాంతి.అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరారు విజయశాంతి.. కాంగ్రెస్ పార్టీ కూడా విజయశాంతికి ప్రచార కమిటీలో చోటు కల్పించింది. దీంతో పలు నియోజకవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు ప్రచారం చేసింది. అయితే ఇక కాంగ్రెస్‌లో విజయశాంతి స్థానం ఏంటంటే ఇంతే అని చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు పార్టీ కార్యక్రమాలలో విజయశాంతి ఎక్కడా పాల్గొన్న దాఖలాలు లేవు. దీంతో విజయశాంతి ఎక్కడ అనే చర్చ జరుగుతోంది.

      ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మంది నేతలు వివిధ పదవుల కోసం పోటీ పడుతున్నారు. కానీ విజయశాంతి మాత్రం ఎటువంటి చర్చలో పాల్గొనలేదు. ఇదే కాకుండా మెదక్ ఎంపీ అనుకున్నా ఆ విషయం పై కూడా పార్టీ లో ఎలాంటి చర్చ జరగ లేదు.. దీంతో విజయశాంతి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీనికి తోడు రానున్న లోక్ సభ ఎన్నికలకు విజయశాంతి మళ్ళీ ప్రచారం చేయాలని పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో విజయశాంతికి ఏదైనా పోస్ట్ ఇస్తారా లేక ఇలాగే పార్టీ సేవలకు ఉపయోగిస్తారా అనేది చూడాలి. ఒక వేళ ఏ పోస్ట్ ఇవ్వకున్నా విజయశాంతి పనిచేస్తుందా! అనేది కొంత మంది నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎన్నికల ముందు హాడావిడి చేసిన విజయశాంతి ప్రభుత్వం ఏర్పడ్డాక సైలెంట్ అవ్వడం మాత్రం చర్చకు దారితీస్తోంది.

Exit mobile version