Site icon Swatantra Tv

కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలకు చేరే సారలమ్మ

       దక్షిణభారత కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర సర్వం సిద్ధమైంది. ఆది వాసీల ఆరాధ్యదైవాలైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు భక్తకోటి తండోపతండాలుగా తరలివస్తోంది. ఇవాళ్టి నుంచి నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా మేడారం జాతర జరగనుంది. సమ్మక్క కుమారుడైన జంపన్నను కన్నెపల్లి నుంచి ఆదివాసీ నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య గిరిజనపూజారులు గద్దెలపైకి తీసుకొచ్చారు. పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించడం జాతరలో తొలి కీలక ఘట్టం. ఈ రోజు ఉదయం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గుడి నుంచి సారలమ్మ భర్త గోవిందరాజును పూజారులు గద్దెల వద్దకు తీసుకొస్తారు.

     ఆచారం ప్రకారం సమ్మక్క తనయుడు జంపన్న గద్దెపైకి చేరుకున్నాడు. కన్నెపల్లిలో కొలువైన జంపన్నను సంప్రదాయబద్ధంగా గద్దెపైకి తీసుకువచ్చారు. కర్ర, డాలును జంపన్నకు ప్రతిరూపంగా కొలుస్తారు.కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చే ఘట్టం ఎంతో కోలాహలంగా జరుగుతుంది. కన్నెపల్లి గ్రామస్థులైన ఆడపడుచులు సారలమ్మ ఆలయాన్ని ముగ్గులతో అందంగా అలంకరిస్తారు. సాయంత్రం అమ్మవారిని పూజారులు ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొస్తారు. రేపు చిలకలగుట్టపై ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు పూర్తిచేశాక, ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొచ్చి సమ్మక్కను ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం నిండు జాతర కాగా, శనివారం దేవతల వన ప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది. తెలంగాణ నుంచే కాకుండా, ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు భారీగా భక్తులు వస్తారు. ఈసారి మేడారం జాతరకు కోటి మంది భక్తులు వస్తా రని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫిబ్రవరి 23న అమ్మలను దర్శించు కుంటా రని మంత్రి సీతక్క తెలిపారు. గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్‌రెడ్డి కూడా అదే రోజు మేడారానికి రానున్నారు.

      మేడారం జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.110 కోట్లతో ఏర్పాట్లను పూర్తిచేసింది. భక్తుల భద్రత కోసం పోలీసు, రెవెన్యూ శాఖలు కలిపి 700 వరకు సీసీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. పోలీసు శాఖ బందోబస్తు కోసం 14 వేల మందిని రంగంలోకి దింపారు. భక్తులకు ఆన్‌లైన్‌లో ప్రసాద వితరణ సేవలను అందుబాటులోకి తెచ్చారు. జంపన్నవా గు వద్ద భక్తుల పుణ్య స్నానాలకు వీలుగా లక్నవరం జలాశయం నుంచి నీటిని వదిలారు. పిల్లలు, వృద్ధుల కోసం అయిదు వేలకుపైగా జల్లు స్నానాల ఘాట్లపై ఏర్పాటు చేశారు. మేడారం పరిసరాల్లో 5 వేల 730 మరుగుదొడ్లను ఏర్పా టుచేశారు. ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు వాహనాల పార్కింగ్‌ కోసం పోలీసులు వేర్వేరు దారులతో రూట్మ్యాప్‌ సిద్ధంచే శారు. ఆర్టీసీ బస్సులు తాడ్వాయి మీదుగా, ప్రయివేటు వాహనాలు పస్రా మీదుగా జాతరకు రావాలని పోలీసులు సూచి స్తున్నారు. ప్రయివేటు వాహనాల పార్కింగ్‌ కోసం పస్రా నుంచి మేడారం వరకు 40 ప్రాంతాల్లో పార్కింగ్‌ స్థలాలను సిద్ధం చేశారు. తెలంగాణ కుంభమేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో పాల్గొనే భక్తులు, సందర్శ కుల కోసం రాష్ట్ర పర్యాటక సంస్థ ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది.కాంట్రాక్టరు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ జగజ్యోతిని ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేయనున్నారు. ఆమె ఇంట్లో సోదాలు జరుగుతుండగానే తనకు అస్వస్థతగా ఉందని జగజ్యోతి చెప్పడంతో ఏసీబీ అధికారులు ఆమెను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమెకు అన్ని పరీక్షలు చేసిన వైద్యులు ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. ఇవాళ ఉదయం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేయనున్నారు. ఆ తర్వాత రిమాండుకు తరలించనున్నారు.

Exit mobile version