Site icon Swatantra Tv

ఇండియన్ స్టూడెంట్స్‌ని టార్గెట్ చేస్తున్న కెనడా ?

     భవిష్యత్ లో కెనడాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గించాలని కెనడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇది భారతీయ విద్యార్థులకు దెబ్బే. కెనడాకు వెళ్లే విద్యార్థులలో భారతీయులే ఎక్కువ అసంఖ్యాకంగా విద్యార్థులతో విద్యా వ్యవస్థ అదుపు తప్పుతోందని కెనడా ఇమిగ్రేషన్ , రెఫ్యూజీస్, సిటిజన్ షిప్ శాఖమంత్రి మార్క్ మిల్లర్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కెనడాలో చేరే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పరిమితం చేయాలని ఆయనసూచించారు.కెనడాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం 9 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు చదువుతున్నారు. వీరి సంఖ్యను ఏ మేరకు తగ్గిస్తారని కెనడా మంత్రి చెప్పలేదు. కెనడాకు వచ్చే విద్యార్థులలో బారతీయులే ఎక్కువ. 2023 నవంబర్ నాటి లెక్కల ప్రకారం మొత్తం 5, 79, 075 మంది అంతర్జాతీయ విద్యార్థులు ఉంటే, వారిలో భారతీయులే 2, 15, 910 మంది అంటే దాదాపు 41 శాతం. ఐదేళ్ల లో భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని కెనడా మంత్రి మిల్లర్ అన్నారు.

 

Exit mobile version