Free Porn
xbporn
25.2 C
Hyderabad
Friday, October 11, 2024
spot_img

ఆర్థిక సంక్షోభంలో… పాకిస్తాన్

ఆర్థిక సంక్షోభం ఒకొక్క దేశాన్ని కుదేలు చేస్తోంది. మొన్న శ్రీలంక గిలగిల్లాడగా, నేడా పరిస్థితి పాకిస్తాన్ ఎదుర్కొంటోంది. చైనా సాయంపై ఆధారపడిన పాకిస్తాన్, అక్కడ నుంచి నిధులు రాకపోవడంతో అప్పుల కోసం ఇతర దేశాలవైపు చూస్తోంది. గత ఏడాది భారీ వరదల కారణంగా పాకిస్తాన్ లో మూడొంతులు నీట మునిగింది. అన్ని సమస్యలు ముప్పేట దాడి చేయడంతో ప్రస్తుతం ఖర్చులు తగ్గించుకోవడం కోసమని కరెంటు వినియోగాన్ని తగ్గిస్తున్నారు.  అమెరికాలోని పాత రాయబార కార్యాలయాన్నికూడా బేరం పెట్టేశారు. మరోవైపు పక్కలో బల్లెంలా ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దు యుద్ధాలు జరుగుతున్నాయి.

దీనికోతోడు రాజకీయ సంక్షోభం దిశగా కూడా ఆ దేశం పయనించడంతో నేతలు అందరిలో గుబులు మొదలవుతోంది. ఎందుకంటే అక్కడే మాత్రం అవకాశం దక్కినా సైన్యం చేతుల్లోకి దేశం వెళ్లిపోతుంది. సైన్యాధ్యక్షుడు పరిపాలించడం అక్కడ పరిపాటిగా.  ఈ పరిస్థితుల్లో పాక్ ఏం చేస్తోందని అంటే…పక్కనే అరబిక్ దేశాలవైపు చూస్తోంది. ఇప్పటికే సౌదీ అరేబియా 8 బిలియన్ డాలర్ల సాయం అందించింది. అదీ సరిపోవడం లేదు.

 ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద విదేశీ మారక నిల్వలు మూడు నెలలకు మాత్రమే సరిపడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేశ రూపాయి విలువ భారీగా పతనమైంది. ఒక డాలర్ విలువ రూ.228గా ఉంది. మన దేశంలో రూ.84 అంటే అమ్మో అంటున్నాం. సాయంకోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), సౌదీ వద్దకు పాక్ పరుగులు పెడుతోంది. అయితే ఐఎంఎఫ్ ఎన్నో ఆంక్షలు విధించడంతో, అవన్నీ ఒప్పుకుంటే రాజకీయ సంక్షోభం తప్పదని భావిస్తోంది. ప్రస్తుతానికి అంత సాయం కాకపోయినా, కొంతలో కొంతైనా చేసి, ఒక ఆరునెలల గ్రాసానికి కావల్సినంత ఇవ్వమని ప్రాధేయపడుతోంది.

వరదలు కారణంగా పంటలు పండక ఆర్థిక లావాదేవీలు ఆగిపోయాయి. అంతేకాదు ఎగుమతులు కూడా తగ్గిపోయాయి. దిగుమతులకు వెచ్చించాల్సి వస్తుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగిపోయి అప్పుల కుప్పగా పాక్ మారిపోతోంది. ఇకపోతే విద్యుత్ వినియోగం తగ్గించుకోవడం కోసం రాత్రి 8.30గంటలకే దుకాణాలు కట్టేయమని చెప్పారు. అలాగే కార్యాలయాల్లో కూడా 30శాతం విద్యుత్ వినియోగాన్ని తగ్గించారు. పెళ్లిళ్లు కూడా రాత్రి 10.30 గంటల్లోపు ముగించుకోవాలని తెలిపారు. ఇవన్నీ చేయడం వల్ల సుమారు రూ.600 కోట్ల వరకు ఆదా చేయవచ్చునని భావిస్తున్నారు. ఇలా ఎన్ని నివారణా చర్యలు తీసుకుంటున్నా పరిస్థితులు అదుపులోకి వస్తాయనే నమ్మకం పాకిస్తాన్ పాలకుల్లో కనిపించడం లేదని అంటున్నారు.

మరోవైపు సరిహద్దుల్లో ఆఫ్ఘనిస్తాన్ కవ్వించడంతో వారితో యుద్ధం చేయాల్సివస్తోంది. ఇది కూడా ఖర్చుతో కూడుకున్న పనే…ఇలా ముప్పేట దాడితో పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. ఇన్నాళ్లు చైనా సహకారంతో భారత్ పై కారాలు-మిరియాలు నూరిన పాక్…ఇప్పుడు తను తీసిన గోతిలో తానే పడినట్టయ్యింది.

చైనాలో కోవిడ్ కేసులతో ఆ ప్రభుత్వం పక్కదేశ పరిస్థితులను చూసే స్థితిలో లేదు. ఇక అమెరికా కూడా వారి దేశ బడ్జెట్ కు అనుకూలంగానే ఇస్తారుగానీ, ఇష్టం వచ్చినట్టు ఇవ్వరు. ఇప్పుడిద్దామని అనుకున్నా, అక్కడ మళ్లీ రిపబ్లికన్లు ప్రతినిధుల సభలో పాగా వేయడంతో అధికారపార్టీ ఏం చేసినా వీరు కాదంటారు. పాకిస్తాన్ కోసం మాకెందుకు గొడవ అని వారు తలదూర్చరని అంటున్నారు. ఇక రష్యా ఎప్పుడూ ఇండియావైపే ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. వీటన్నింటి దృష్ట్యా పాక్ పరిస్థితి మరి కొద్దిరోజుల్లో శ్రీలంకలా మారినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు వ్యాక్యానిస్తున్నారు.

Latest Articles

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో నూతన సినిమా

మాతంగి మీడియా వర్క్స్ బ్యానర్ పై సరస్వతి మౌనిక నిర్మాతగా, దీప విజయ లక్ష్మి నాయుడు క్రియేషన్స్ బ్యానర్ పై ఆకుల విజయ లక్ష్మి నిర్మాతగా తెరకెక్కనున్న ప్రోడక్షన్ నంబర్ 1 సినిమాను...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్