Site icon Swatantra Tv

ఆరు గ్యారెంటీలపై కన్నేసిన సైబర్ నేరగాళ్లు

            తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పేరుతో సైబర్ నేరగాళ్లు విరుచుకుపడే అవ కాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సైబర్ విభాగం పోలీసులు సూచిం చారు. అపరిచితులు ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీల అడిగితే చెప్పొద్దని చెప్తున్నారు. అలాగే సామాన్య ప్రజలను సైతం గైడ్ చేయాలని రక్షణ శాఖ యంత్రాంగం స్పష్టం చేసింది. ఓటీపీలడిగి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలు చెప్పకూడదని, ఆరు గ్యారెంటీలకు అర్జీలను పెట్టకున్న ప్రజలకు తెలిపారు. ప్రస్తుత సీజన్ బట్టి సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త మోసాలకు తెరలేపుతారని, దరఖాస్తుదారులకు ప్రభుత్వ నుండి ఎలాంటి ఓటీపీలు రావు. కాబట్టి ఇలాంటి మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్త పాటించండి.అంతేకాదు ఫోన్లకు వచ్చే ఫేక్ మెసేజ్ లని పొరపాటున కూడా ఓపెన్ చేయకూడదని సైబర్ విభాగం, పోలీసులు ప్రజలకు తెలిపారు.

 

Exit mobile version