Site icon Swatantra Tv

అశేష అభిమానులను వదిలి….

నింగికేగిన మరో తార

టాలీవుడ్ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమేడియన్ ఇలా ఒక పాత్ర కాదు ఎన్నో పాత్రలను అవలీలగా పోషించి సుమారు 700 చిత్రాల్లో నటించి నవరస నటనా సార్వభౌమునిగా టాలీవుడ్ ని ఏలిన మన కైకాల  సత్యనారాయణ (87) మనకు ఇక లేరు…

ఆనాటి తరమంతా ఒకొక్కరుగా తెలుగు సినిమా అభిమానులను వదిలి వెళ్లిపోతున్నారు. మొన్నటికి మొన్న కృష్ణంరాజు, నిన్న కృష్ణ, నేడు సత్యనారాయణ ఒకరితో ఒకరు మాట్లాడుకుని వెళ్లినట్టుగా వెళుతున్నారని అభిమానులు వ్యాక్యానిస్తున్నారు.  ఫిలింనగర్ లోని తన నివాసంలో తెల్లవారుజామున 4 గంటలకు అశేష అభిమానులను శోకసంద్రంలో ముంచి తుదిశ్వాస విడిచారు.

భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలింనగర్ లో ఉంచనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం నాడు మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

1935 జులై 25న కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో జన్మించారు. విజయవాడ, గుడివాడలో విద్యాభ్యాసం జరిగింది. కైకాలకు భార్య నాగేశ్వరమ్మ, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1959లో సిపాయి కూతురు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 60 ఏళ్ల నట ప్రస్థానంలో 777కి పైగానే సినిమాల్లో నటించారు. నవరస నటనా సార్వభౌమునిగా కీర్తి గడించారు.

మహేష్ బాబు నటించిన మహర్షి…తన చివరి సినిమా అని చెప్పాలి. హీరోయిన్ తాతయ్యగా నటించి మెప్పించారు.

Exit mobile version