దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే నాటికి సెన్సెక్స్ 311 పాయింట్లు కోల్పోయి 60,691కి పడిపోగా.. నిఫ్టీ 99 పాయింట్లు నష్టపోయి 17,844 వద్ద స్థిరపడింది. ఇవాళ ఉదయం మార్కెట్లు లాభాలలో ప్రారంభమైనా.. అమెరికా ఫెడ్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లు పెంచబోతుందనే వార్తలతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ, ఆటో రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాలు నష్టాలను చవిచూశాయి. టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ వంటి షేర్లు మాత్రం లాభాల్లో ముగిశాయి.
అమెరికా ఫెడ్ రిజర్వ్ ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
