Unstoppable Balakrishna_ pawan kalyan Programme: అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ 2 షోలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రానున్నారు. బాలకృష్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ఎపిసోడ్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు అంతా అనుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు అ తేదీని అధికారికంగా ప్రకటించ లేదు. అయితే పవన్ కల్యాణ్ ప్రోగ్రాం తర్వాత అన్ స్టాపబుల్ స్ట్రీమింగ్ ఆగిపోతుందని అంటున్నారు. ఇదే ఈ సీజన్ కి లాస్ట్ ఎపిసోడ్ గా చెబుతున్నారు.
మొదటి అన్ స్టాపబుల్ సక్సెస్ ఫుల్ గా రన్ చేసిన బాలయ్య, తనదైన శైలిలో, తనదైన మార్కుతో అలరించారు. అలాగే సెకండ్ సిరీస్ లో మాత్రం పొలిటికల్ లీడర్స్ ను కూడా తీసుకువచ్చారు. రావడం రావడమే బావ చంద్రబాబు నాయుడిని తీసుకువచ్చి హడావుడి చేశారు. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఫెయిల్యూర్స్ ను కూడా ధైర్యంగానే అడగడం ఇక్కడ చెప్పుకోతగిన అంశమని చెప్పాలి.
ఇక షోకి వచ్చిన అతిథులను మాటలతో అలరించి, వారిలో బెరుకుతనాన్ని పోగొట్టి తన మాటలు, చేష్టలతో కార్యక్రమాన్ని రసవత్తరంగా మార్చుతున్న తీరు చూసి పలువురు శభాష్ బాలయ్యా అంటున్నారు. ఎక్కడా కాంట్రవర్శీ అనేది లేకుండా ముందుకెళుతున్నారు. ఇప్పటివరకైతే అలాంటి నెగిటివ్ కామెంట్స్ రాలేదు. యంగ్ హీరోలతో కలిసి ఇంటర్వ్యూగా కాకుండా ఒక ఫ్యామిలీ మీట్ గా మార్చి ప్రశ్నలను అడిగి, తనకు కావల్సినదేదో రప్పించడానికి శతవిధాల బాలయ్య ప్రయత్నిస్తున్నారు.
అడగను, అడగకూడదు, అడగడం భావ్యం కాదు, ఏయ్…ఏంటయ్యా ఇలాంటి ప్రశ్నలన్నీ ఇస్తారు? నా సంగతి తెలుసు కదా? అంటూ ప్రోగ్రాం ఎడిటర్స్ పై ఎగరడం ఇవన్నీ ఆకట్టుకునేలా చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం పవన్ కల్యాణ్, బాలయ్య ఇద్దరూ పవర్ ఫుల్ వ్యక్తులే…వారిద్దరి ప్రోమో చూస్తుంటే ఆవేశంగానే టాపిక్ నడిచందని అంటున్నారు.
ఇంతకీ అసలు సంగతేమిటంటే…ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఫిబ్రవరి 3న విడదలవబోతోంది అని అంటున్నారు.